సిరా న్యూస్,సికింద్రాబాద్;
కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించడంతో సికింద్రాబాద్ అడ్డగుట్టలోని ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు అక్కడికి చేరుకొని సంబరాలు జరుపుకున్నారు.. ముందుగా పెద్ద ఎత్తున అభిమానులు తుకారాం గేట్ లోని రియో పాయింట్ హోటల్ వద్దకు చేరుకొని అక్కడి నుండి శ్రీ గణేష్ ఇంటి వరకు చేపట్టిన ర్యాలీలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. వారికి పెద్ద గజమాలతో సత్కరించారు.. ఇంటి వద్దకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకొని శ్రీ గణేష్ ను సన్మానించడానికి, శుభాకాంక్షలు తెలపడానికి పోటీ పడ్డారు.