SR Junior College: నీట్ ఫలితాల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ ఎస్ ఆర్ జూనియర్ కాలేజీ…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

నీట్ ఫలితాల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ ఎస్ ఆర్ జూనియర్ కాలేజీ…

+ ఇంటర్, ఐఐటీ, నీట్ పరీక్షల్లో కొనసాగుతున్న విజయ పరంపర

మంగళవారం ప్రకటించిన నీట్ -2024 ఫలితాల్లో ఎస్ ఆర్ జూనియర్ కాలేజీ, ఆదిలాబాద్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి, విజయ ఢంకా మోగించారు. కళాశాలకు చెందిన

1. వై. అశ్విన్  రెడ్డి, 580/720 (HT NO – 4209030346),

2. రాథోడ్ అక్షయ 527/720 (HT NO – 4209020201),

3. ధోతీ  ఆదిత్య 493/720 (HT NO – 4209020407),

4. ధోతీ అనీష్ 482/720 (HT NO – 4209020173),

5. పొద్దటి  అను 421/720  (HT NO – 4209010308),

6. జాదవ్ అన్విక 418/720 (HT NO – 4221080302),

7. బాల్నే  సాత్విక 405/720 (HT.NO–4201270086)లు అత్యుత్తమ మార్కులతో నీట్ కు అర్హత సాధించారు. కాగా బుధవారం కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను తల్లితండ్రుల సమక్షంలో కాలేజీ  యాజమాన్యం పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డీజీఎం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ఎలాంటి లాంగ్ టర్మ్ కోచింగ్ లు అవసరం లేకుండా ప్రతీ ఏట ఇంటర్ తరువాత పదుల సంఖ్యలో విద్యార్థులు నీట్, జేఈఈలకు అర్హత సాధించడం ఎస్ ఆర్ జూనియర్ కళాశాలకే సాధ్యమని అన్నారు. ఈ విజయానికి సహకరించిన కళాశాల అధ్యాపకులు, తల్లితండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ వరద రెడ్డి,  డైరెక్టర్స్ సంతోష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, జోనల్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్స్ కే బ్రహ్మం, జైపాల్ రెడ్డి, అరవింద్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *