సిరా న్యూస్,పల్నాడు;
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు రంగం సిద్దమయింది. పిన్నెల్లి ప్రస్తుతం మద్యంతర బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో గురువారానికి గడువు ముగియనుంది. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని కూడా అరెస్టు చేయనున్నారు. అయితే ప్రస్తుతం గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరారీలో ఉన్న నేపథ్యంలో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిన్నెల్లి, గోపిరెడ్డి తమ మధ్యంతర బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో మరి నేడు బెయిల్ పొడిగించేందుకు హై కోర్టుని ఆశ్రయించునున్నారుని సమాచారం. నర్సాపేటలో పిన్నెల్లి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అనే సంకేతాలు వినబడుతున్నాయి…
========