సిరా న్యూస్,ఖమ్మం;
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నేతలు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. జై సోనియమ్మ జై కాంగ్రెస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీనీ అభవర్ణించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, నగర అధ్యక్షులు జావేద్, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు