సిరాన్యూస్,ఓదెల
కృత్రిమ గర్భధారణ ద్వారా ఆడ దూడ జననం : గోపాలమిత్ర గోపతి ప్రవీణ్
వేగంగా పశు జాతి అభివృద్ధి చెందడం కోసం తెలంగాణ రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ సెక్స్‌డ్ సెమన్ ఉపయోగించి గోపాలమిత్ర గోపతి ప్రవీణ్ ద్వారా కృత్రిమ గర్భాధారణ చేయించగా మొదటగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన చింతం మొగిలి పాడి రైతు హెచ్ ఎఫ్ ఆవుకు సెక్డ్స్ సెమెన్ వేయాగా గురువారం ఆడ దూడకు జన్మనిచ్చిందని కరీంనగర్ ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సూపర్‌వైజర్ రాఘవ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓదెల మండలంలోని రైతులు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సెక్స్‌డ్ సెమెన్ ద్వారా 90 శాతం వరకు ఆడ దూడలు జన్మనిస్తాయని, ఒక సెక్స్‌డ్ సెమెన్ వీర్యం స్ట్రా ధర రూ. 675 నిర్ధారణ చేయడం జరిగిందని, రైతుల వాటాగా 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నుండి 425 రూపాయలు సబ్సిడీ ఉంటుందని ఆయన తెలిపారు. ఈసెక్స్‌డ్ సెమెన్ అన్ని గోపాలమిత్ర కేంద్రాల వద్ద ఉంటుందని, పాడి రైతులు ఒకటి నుండి మూడు ఈతల లోపు ఆవులకు గేదెలకు ఎదలో ఉన్నప్పుడు కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలని ఆయన తెలిపారు.