సిరాన్యూస్,కళ్యాణదుర్గం
నాగార్జునకు రూ.20వేల ఆర్థిక సాయం చేసిన బద్దె నాయక్
* బాధితులకు కిరాణా సరకుల పంపిణీ
* బద్దె నాయక్ సేవలకు అమోఘం అంటున్న ప్రజలు
కష్టం వచ్చిఆదుకోవాలని అడగడమే ఆలస్యం…. నేనున్నానంటూ ముందుకొచ్చే గొప్ప సేవకుడు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్.ఇందులో భాగంగానే కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామానికి చెందిన నాగార్జున,భాగ్యమ్మ దంపతులు ఇద్దరూ అనారోగ్యం తో బాధ పడుతున్నారు. నాగార్జునకి ఒకే కాలుకు 3సార్లు ఆక్సిడెంట్ కావడం తో నడవలేని స్థితిలో ఉన్నారు. అతని భార్య భాగ్యమ్మ కు కిడ్నీ ఇన్ఫెక్షన్ కావడంతో ఆపరేషన్ చేసి కిడ్నీ తీసివేశారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ మంచానికే పరిమితం అవ్వడంతో కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉందని బాధితులు తెలిపారు. వచ్చే పెన్షన్ మందులకే సరిపోతుందని, ఇంట్లో గడవడం కష్టంగా ఉందని గ్రామ యువకుల ద్వారా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ట్రస్ట్ ఛైర్మెన్ బద్దేనాయక్ రూ.15,000, ట్రస్ట్ కార్యదర్శి హరీష్ రూ.5000, మొత్తం 20,000/-నగదును , 9వేల రూపాయల బియ్యం, కిరాణా సరుకులను అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ఛైర్మెన్ సురేష్, కార్యదర్శి హరీష్, ట్రెజరర్ అబ్దుల్ వాహబ్ సభ్యులు లోకేష్, తిప్పేస్వామి,మహేష్, వెంకటేష్ పాల్గొన్నారు.