సిరా న్యూస్, పిఠాపురం:
క్రైస్తవ్యం అంటే శాంతికి మరో మార్గం…
క్రైస్తవ్యం అంటే శాంతికి మరో మార్గమని కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. శనివారం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ఫీల్డ్ కౌన్సిల్ క్రిస్మస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రైస్తవ్యం వైపు సామాన్యులను సైతం నడిపించగలిగేవారే పాస్టర్లు అని అన్నారు. ఫీల్డ్ కౌన్సిల్లో పాస్టర్లందరికీ ఆయన తన చేతుల మీదుగా మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చ్ ప్రతినిధులు ఎమ్మెల్యేని పులమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గుబ్బలసాల్మన్ రాజ్, కార్యదర్శి ప్రసన్న కుమార్,మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబి, ప్రోగ్రాం కన్వీనర్ గుబ్బాల ఎలీషా, ఇతర పాస్టర్లు పాల్గొన్నారు.