సిరాన్యూస్, ఆదిలాబాద్
జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్‌కు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్‌ను శుక్రవారం ఎస్సీ, ఎస్టీ వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ రాథోడ్ నరేందర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజషన్ అధికారి డా. వై,సి.శ్రీనివాస్ ,జిల్లా వ్యవస్థాపక సంఘం అధ్యక్షులు రాథోడ్ బాబూలాల్, జిల్లా నాయకులు ఆడే సురేష్, బొమ్మెత సుభాష్, మహిళా విభాగం సీహెచ్ఓ వసంత, శ్యామల, ఆఫీస్ మినిస్టీరియల్ సిబ్బంది గుజరాతి గోపి, శ్రీకాంత్ రెడ్డి, గంగారెడ్డి, శ్రీధర్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.