చేప ప్రసాదం ప్రారంభించిన మంత్రి పొన్నం

 సిరా న్యూస్,హైదరాబాద్;
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే దానం నాగేందర్,ఫిషర్మర్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితర ముఖ్య నేతలుపాల్గోన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మృగశిర కార్తి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీ జరుగుతుంది. చాలా కాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో ప్రజలు వేసుకుంటున్నారు. 150 సంవత్సరాలుగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అస్తమా , శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ ఫిష్ మెడిసిన్ వేసుకుంటారు. వివిధ దేశాలు ,ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ చేప ప్రసాదం కోసం వస్తున్నారు. బత్తిని కుటుంబంలోని మొత్తం ఈ చేప ప్రసాదం వేయడానికి ఇక్కడే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం కోసం చేపలు ఏర్పాటు చేయడం తో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *