సిరా న్యూస్, డిజిటల్:
పెంచ్ నేషనల్ పార్క్‌లో పులుల హల్చల్…
+ పులులను సెల్ఫోన్లో బంధించిన కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి
మధ్యప్రదేశ్‌లోని పెంచ్ నేషనల్ పార్క్‌లో పులులు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఈ పార్క్ సందర్శకులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న టైగర్ రిజర్వాయర్‌లో సఫారీ ప్రత్యేకత చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల లోక ప్రవీణ్ రెడ్డి, తన కుటుంబ సమేతం నేషనల్ పార్క్‌ను సందర్శించారు. రిజర్వాయర్‌లో సఫారీ రైడ్‌కు వెళ్లి పులులను వీక్షించారు. పచ్చని అడవి, చుట్టుపక్కల సంచరిస్తున్న పులులను చూస్తూ, వాటి చిత్రాలను సెల్‌ఫోన్ కెమెరాలో బంధించారు. కాగా తాము సఫారీకి వెళ్లినప్పుడు మొత్తం 6 పులులు కనిపించినట్లు ఆయన సిరా న్యూస్‌కి తెలిపారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుండి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంచ్ నేషనల్ పార్క్ సందర్శించడం గొప్ప అనుభూతినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.