SP Goush alam: జిల్లాలో 97 హోంగార్డుల బదిలీలు: ఎస్పీ గౌష్ ఆలం

సిరా న్యూస్,ఆదిలాబాద్‌
జిల్లాలో 97 హోంగార్డుల బదిలీలు: ఎస్పీ గౌష్ ఆలం
* 62 మంది నిర్మల్, 35 మంది కొమురం భీమ్ ఆసిఫాబాద్ కు బదిలీ
* హోంగార్డుల బదిలీ ప్రక్రియను నిర్వహించిన ఎస్పీ

పారదర్శకంగా హోంగార్డుల బదిలీ ప్రక్రియ పూర్తి అయ్యింద‌ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆదిలాబాద్ జిల్లాలో హోంగార్డుల బదిలీ ప్రక్రియను జిల్లా ఎస్పీ అధ్యక్షతన ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా పూర్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం హోంగార్డుల బదిలీ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంద‌న్నారు. అందులో భాగంగా నిర్మల్ జిల్లా నుండి 62 హోంగార్డులు,  కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుండి 35 మంది హోంగార్డులు ఆదిలాబాద్ జిల్లాకు రానుండగా,  వారి స్థానంలో ఆదిలాబాద్ జిల్లా నుండి మొత్తం 97 మంది హోంగార్డులను లక్కీ లాటరీ విధానం ద్వారా బదిలీ ప్రక్రియను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో సాధారణ విధులు నిర్వర్తించే హోంగార్డులు, వాహన డ్రైవర్స్, దోబీలు, వంట పని చేసే వారు, వివిధ రంగాలలో విధులు నిర్వహిస్తున్న మొత్తం 97 మందిని నిర్మల్ , ఆసిఫాబాద్ జిల్లాలకు ఇద్దరిని ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించినట్లు తెలియజేశారు. బదిలీ ప్రక్రియను అందరూ హోంగార్డుల నడుమ పారదర్శకంగా ఎటువంటి అపోహలు లేకుండా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నవీన్, టి మురళి, చంద్రశేఖర్, పోలీసు కార్యాలయం సిబ్బంది సూపరింటెండెంట్ సంజీవ్, సిబ్బంది, హోంగార్డ్ యూనిట్ అధికారులు రమేష్, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *