Loka Praveen Reddy: భూకబ్జా దారులను కఠినంగా శిక్షించాలి:  లోక ప్రవీన్ రెడ్డి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
భూకబ్జా దారులను కఠినంగా శిక్షించాలి:  లోక ప్రవీన్ రెడ్డి

భూకబ్జా దారులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాల‌ని కైలాష్ నగర్ కాలనీ డెవలప్ మెంట్ కమిటీ అధ్యక్షులు లోక ప్రవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు దుర్గం శేఖర్ అన్నారు. సోమ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ కాలనీ డెవలప్ మెంట్ కమిటీ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌ర్ రాజర్షి షాకు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈసంద‌ర్బంగా వారు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ వార్డు 38 లో సొసైటీ కీ సంబందించిన 8 ప్లాట్లలో 2 ప్లాట్లని తప్పుడు ధ్రువ పాత్రలతో కబ్జాలు చేయడానికి ల్యాండ్ మాఫీయా ప్రయత్నించారు. అయితే కైలాష్ నగర్ కాలనీ డెవలప్ మెంట్ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు కలిసి కబ్జాదారులు అడ్డుకొని ఈ సమస్యను జిల్లా కలెక్ట‌ర్‌ దృష్టికి తీసుకెళ్లామ‌ని తెలిపారు. తక్షణమే స్పందించిన క‌లెక్ట‌ర్‌ ఆర్ డిఓ, తహిసీల్దార్, మునిసిపల్ కమిషనర్ తో మంగళవారం కైలాష్ నగర్ కబ్జా చేసిన ప్లాట్స్ వద్దకు వెళ్లి దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా సొసైటీ సభ్యులు, కాలనీ వాసులు కలెక్ట‌ర్‌కి ధన్యవాదములు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ముత్యాల చిట్టీ బాబు, రాంకిషన్, రాంకుమార్, రాంరెడ్డి, కొండల్ రావ్, బాబురావు, రాకేష్, త్రినాధ్ , ప్రవీణ్ అగర్వాల్, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *