సిరా న్యూస్,పరవాడ;
పరవాడ గ్రామం సినిమా హాల్ జంక్షన్ వద్ద అనిత ఐ క్లినిక్ డాక్టర్ గోపి ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పరవాడ మండల ఇన్చార్జి పంచకర్ల ప్రసాద్, మాజీ జడ్పిటిసి,ఎంపీపీ పైల జగన్నాధ రావు విచ్చేసి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ గోపి డాక్టర్ జాక్సన్ సుమారు 250 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. 50 మందిని శుక్లాల ఆపరేషన్ కొరకు శంకర పౌండేషన్ హాస్పిటల్ కు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి బుగిడి గోవింద్ , మండల పార్టీ అధ్యక్షులు బొద్ధపు శ్రీనివాస్ కాసులు, పరవాడ గ్రామ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పైలా రామచంద్రరావు, పెద్ద చెరువు అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు, డి .ఎం. ఎల్ నాయుడు, బొద్దపు అయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.