సిరా న్యూస్,కుప్పం;
చిత్తూరు జిల్లా కుప్పంలో వైరల్ గా మారింది. కుప్పంలో నీతి నిజాయితీగా ఉన్న వైసిపి కార్యకర్తలు ధైర్యంగా ఊర్లలో తిరుగుతున్నామని, అక్రమాలు అన్యాయాలు చేసిన రెస్కో ఛైర్మన్ సెందిల్ పరార్ అయ్యాడని వీడియోలో పేర్కొనడం కుప్పంలో హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ద్వారా కోట్లు కూడకట్టుకోవడం మినహా కార్యకర్తలకు ఏమి చేయకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని రాజేంద్ర నిప్పులాంటి నిజాలను వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కుప్పంలో ప్రధాన వైసిపి నాయకులు ఊరు వదిలి పారిపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సమాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది…
====