సిరా న్యూస్,తాండూరు;
ప్రతిరోజు 20 నిమిషాల వ్యవధిలో ఒక్కో బస్సు నడిపిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఐదు గంటల పాటు బస్సులు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు స్వచ్ఛందంగా రోడ్డుపై ఆందోళన చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు బస్ డిపో నుండి నిత్యం మహబూబ్ నగర్ వెళ్లెందుకు ప్రతి 20 నిమిషాల కు ఒక బస్సు ప్రయాణికులను తీసుకువెళ్తుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు ఒక్క బస్సు కూడా మహబూబ్ నగర్ వెళ్లేందుకు ఒక్క బస్సు కూడా లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైకి ఎక్కి నిరసన తెలిపారు. సుమారు 20 నిమిషాల పాటు ఆందోళనచేశారు. పోలీసులు విషయం తెలుసుకొని మహిళలను సముదాయించారు.
========================