సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం బూరాడ గ్రామ సెంటర్లో గంజాయి మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు. ఒంటరిగా వున్న మహిళా ఇంట్లోకి ప్రవేశించారు. మహిళా కేకలు వేయడంతో అక్కడనుంచి తప్పించుకొనే ప్రయత్నం చేసారు. వారిని పట్టుకున్న గ్రామస్థులపై పట్టుకున్న యువకులును మీరు ఎవరు అని ప్రశ్నించిన గ్రామస్తులపై ఆ ముగ్గురు యువకులు రాళ్లు రువ్వడంతో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయిజ ఇద్దరు యువకులు తప్పించుకొని పారిపో్యారు.ఒకడిని గ్రామస్థులు పట్టుకున్నారు. పట్టుకున్న యువకుడి వద్ద గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. ఆ యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.