ఆర్ధిక రాజధానిగా విశాఖ

సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే విశాఖను ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని, కర్నూలును కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఏపీ ప్రజలు గతంలో ఎప్పుడూ ఇవ్వని తీర్పునిచ్చారని, ఏపీ ప్రజలు ఐదేళ్లు విధ్వంసకర పాలన చూశారని, అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని అన్నారు.1994లో ఏకపక్ష ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు రాలేదని, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కడపలో 7కు 5 సీట్లు గెలిచాం.. అభ్యర్థులు గట్టిగా నిలబడ్డ చోట ప్రజలు ఆశీర్వదించారు.. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఢిల్లీలో మమ్మల్ని గౌరవించారని చంద్రబాబు అన్నారు. ఈ తీర్పుతో రాష్ట్ర గౌరవం పెరిగింది.. గెలిచే అభ్యర్థులకే సీట్లు కేటాయించాం.. టీడీపీ, జనసేన పొత్తు గురించి తొలిసారి చెప్పిన వ్యక్తి పవన్ అని గుర్తు చేశారు చంద్రబాబు.ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్లు ఏపీ ప్రజలు విపత్కర పరిస్థితులు చూశారని, ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం దేశానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. కూటమి అంటే ఎలా ఉండాలో ఏపీ ప్రజలు దేశానికి చూపించారన్నారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, కావల్సిన చోట తగ్గాం.. 5 కోట్ల మంది ప్రజలు మనపై ఆశలు పెట్టుకున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు కావాలని, ఈ సమయంలో చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరం అని పవన్‌ అన్నారు. మందుపాతరలు పేలినా బయటపడ్డ నాయకుడు చంద్రబాబు.. ఎన్డీఏ కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబును ప్రతిపాదిస్తున్నామని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *