సిర్యానూస్, ఖానాపూర్ టౌన్
వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తా: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిల్ సర్వ సభ్య సమావేశం
వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణంలో జరుగుతున్న జరగబోయే అభివృద్ధి పనుల పైన వార్డులలో ఉన్న పలు సమస్యలపైన మున్సిపల్ కౌన్సిల్ సర్వ సభ్య సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కారింగుల సంకీర్తన సుమన్ , జన్నరపు విజయలక్ష్మి శంకర్ , నాయిని స్రవంతి సంతోష్ , పరిమి లత సురేష్ ,అఫ్రీన్ అమనుల్లా ఖాన్ , కిషోర్ నాయక్ , అబ్దుల్ ఖలీల్ ,కుర్మా శ్రీనివాస్ , పౌజియ షబ్బిర్ పాష , కో ఆప్షన్ సభ్యులు బండారి కిషోర్ , మాలన్ బేగం ,మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మున్సిపల్ ఈ ఈ,తిరుపతి , మున్సిపల్ మేనేజర్ సురేందర్ , మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్, మున్సిపాలిటీ అధికారులు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.