మరి జనసేన సీఎం ఎప్పుడు

సిరా న్యూస్,కాకినాడ;
ఇంతకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం రాజకీయంగా కూడా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా కొనసాగడమే కాకుండా ఈసారి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ను ఫామ్ చేయడంలో తను కీలకపాత్ర వహించాడు. ఇక 2019 ఎలక్షన్స్ లో ఒకే ఒక్క సీట్ ని గెలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం 21 ఎమ్మెల్యే స్థానాలను, రెండు ఎంపీ స్థానాలను గెలిచి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.ఇక మొత్తానికైతే చంద్ర బాబు నాయుడుని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇక ఇది చూసిన చాలామంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతాడు అంటూ పలు రకాల అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ 2029 లో పక్కాగా సీఎం కూర్చిని దక్కించుకుంటాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జగన్ అరాచక పాలనని రాష్ట్రం నుంచి పోగొట్టలనే ఉద్దేశ్యం తోనే తను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒంటరి గా పోటీ చేసి ఉంటే మళ్ళీ జగన్ ప్రభుత్వమే వచ్చేది. అందుకే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యం తోనే పొత్తు పెట్టుకున్నాడు. ఇక జగన్ సీఎం పదవి నుంచి తప్పుకుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయనను తప్పించి చంద్రబాబు ను సీఎం చేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇక మొత్తానికైతే వచ్చే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ తన పార్టీ పలుకుబడిని మరింతగా పెంచుకొని సీఎం అవ్వడానికి రెడీగా ఉంటాడు. అప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా అంత యాక్టివ్ గా ఉండలేరు.కాబట్టి పవన్ కళ్యాణ్ కి సీఎంగా మారే అవకాశాలైతే ఉన్నాయి. అందుకోసమే ఆయన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తనే అని గట్టిగా నమ్ముతున్నాడు. ఇక ఆ కారణం గానే తను ఈ ఐదు ఏళ్ల లో మంచి పనులు చేసి జనం మెప్పు పొందాలని చూస్తున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి సీఎం అయితే చూడాలి అని అనుకుంటున్నారు…
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *