సిరా న్యూస్,చంద్రగిరి;
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. తిరుపతి జిల్లా, పాకాల మండలం గాదంకి వద్ద జాతీయ రహదారిపై వెనుక వైపు నుండి లారీని కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.వారి కుమారుడు (7) గాయాలతో బయటపడ్డాడు. బాలుడిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉత్తరప్రదేశ్ కు చెందిన జ్యోతి గోయల్( 34) ఆసీస్ గోయల్ (30) గా గుర్తించారు. వీరంతా బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళుతుండగా ఘటన జరిగింది.