సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ కు ఇచ్చిన హామీలను డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ మరియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిళ్ళతోపాటు పదివేల రూపాయల వేతనాలు చెల్లించాలని,ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మధ్యాహ్న భోజ కార్మికులను శ్రమదోపిడి చేస్తున్నారని ఉద్యోగ భద్రత పని భద్రత లేకుండా చేస్తున్నారని, కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వచ్చేనెల ఐదో తారీకు సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు
============================