సిరాన్యూస్, బేల
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యాబోధన: మండల ప్రత్యేక అధికారి శంకర్
* విద్యార్థులకు ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించడం జరుగుతుందని మండల ప్రత్యేక అధికారి శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో నేటి నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉత్సాహంగా విద్యార్థులు బడి బాట పట్టారు. నూతనంగా చేరుతున్న విద్యార్థుల కొరకు స్వాగతం తోరణాలు ఏర్పాటు చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం ప్రారంభమయ్యాయి. నూతనంగా పాఠశాలలకు వస్తున్న విద్యార్థులను ఆకర్షించేందుకు ఆయా విద్యాసంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పలు పాఠశాలల్లో విద్యార్థుల కోసం స్వాగత తోరణాలు, బెలూన్లతో ప్రత్యేకంగా అలంకరించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను ఎంతో ఉత్సాహంగా పాఠశాలలకు తీసుకువచ్చి కూర్చోబెట్టారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా బేల జడ్పీఎస్‌ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోల నర్సింహులు, ఉపాధ్యాయులు పిల్లలకు ఘన స్వాగతం పలికారు.దీంతో పాటు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహాత్మా జ్యోతిభా పూలె గురుకుల పాఠశాల కూడా నేటి నుండి ప్రారంభం అయింది. ఈ సందర్బంగా మండల ప్రత్యేక అధికారి శంకర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా నేటి నుండి పాఠశాలలు ప్రారంభం అయినా సందర్బంగా విద్యార్థులకు ఘన స్వాగతం పలకరించడం జరిగింది అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులతో పాటు నాణ్యమైన విద్యాబోధన ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠశాలలో ప్రభుత్వం మౌళిక వసతులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను కూడా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ వనిత గంబీర్ టాక్రె, ఎంపీడీఓ మహేందర్ కుమార్, ఎంపీవో మహేష్ కుమార్, ఏపీఎం రాజారెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఐకేపీ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.