సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
తహసీల్దార్ ఎదుట 8మంది బైండోవర్: ఎక్సైజ్ ఎస్సై అభిషేకర్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నాటుసారా విక్రయిస్తూ వివిధ కేసులలో పట్టుబడిన ఎనిమిది మందిని బుధవారం ఖానాపూర్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఇంకోసారి నాటుసారా విక్రయిస్తూ పట్టుబడితే వారికి 6 నెలల జైలు శిక్ష లేదా 1,00,000 రూపాయల జరిమానా విధిస్తారని నిర్మల్ ఎక్సైజ్ ఎస్సై అభిషేకర్ తెలిపారు.