సిరాన్యూస్, ఓదెల
మడక పాఠశాలకు లక్ష రూపాయల విరాళం అందజేసిన శ్రీ భాష్యం రాఘవులు
* దాతను అభినందించిన పాఠశాల సిబ్బంది
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో బుధవారం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజున భాష్యం రాఘవులు లక్ష రూపాయల విరాళం అందజేశారు. మడక గ్రామానికి చెందిన రాఘవులు సుదీర్ఘ కాలం పాటు ఈ పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇటీవలే పరమపదించిన ఆయన సతీమణి అహల్య పేరిట ఈ విరాళాన్ని పాఠశాల అభివృద్ధి కోసం వినియోగించాలని కోరుతూ ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ భాష్యం రాఘవులు మాట్లాడుతూ తాను పనిచేసిన పాఠశాల సహాయార్థం అందజేసిన ఈ విరాళం చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, పాఠశాలలో క్రీడా సామర్ధ్యాల పెంపు కోసం ఉపయోగించాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే అందుతుందని, గ్రామస్తులందరూ సహకరించి పాఠశాల అభివృద్ధికి దోహదం చేయాలని కోరారు. దాత శ్రీ భాష్యం రాఘవులును పాఠశాల సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల పద్మావతి ఇంద్రారెడ్డి పాఠశాల విద్య కమిటీ మాజీ చైర్మన్ నోముల రమణారెడ్డి , పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిద్దయ్య, రమాదేవి, సుహాసిని, లక్ష్మణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.