సిరాన్యూస్, కడెం
ఐదు లీటర్ల నాటుసారా పట్టివేత : ఎక్సైజ్ ఎస్సై అభిషేకర్
ఐదు లీటర్ల నాటుసారా పట్టుకొని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ ఎక్సైజ్ ఎస్సై అభిషేకర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఎక్సైజ్ అధికారులు సి, నర్సింహారెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ ఆదిలాబాద్ ఆదేశాల మేరకు ఎంఏ, రాజాక్, డిపి ఈ ఓ నిర్మల్ ఆధ్వర్యంలో కడెం మండలంలో పాండవాపూర్, అంబరిపేట, నవాబుపేట, పెద్దూర్ బెల్లల గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. అనంతరం 2 కేసులు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో డీటీఫ్ ఎస్సై, సింధు, సిబ్బంది ఉన్నారు.