సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
మన ఊరు -మన బడి ప్రో. జయశంకర్ సార్ బడి బాట కార్యక్రమమును నేడు నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం లోని మన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం అయిన కొండారెడ్డి పల్లి గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో మన నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ ఉదయకుమార్ ఐఏఎస్ , జడ్పీటీసీ కేవిఎన్, గ్రామీణ అభివృద్ధి చైర్మన్ ఏనుముల కృష్ణ రెడ్డి, స్థానిక ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎంపీ డా.మల్లు రవి మాట్లాడుతూ ప్రతి పాఠశాల లో కూడా విద్యార్థుల సంఖ్యను పెంచాలి అన్నారు. బడి బాట కార్యక్రమం లో తప్పకుండా స్థానిక నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు ఉదయం, సాయంత్రం పూట ప్రచారం చేపట్టి విజయవంతం చేయాలి అని కోరారు. విద్యార్థులకు స్కూల్ యూని్ఫమ్, పుస్తకాలు అందజేశారు. మెరుగైన టీచింగ్ శిక్షణ ఇవ్వండి దానికి కావాల్సిన నిధులు కావాలి అంటే మంజూరు చేస్తాం అని కలెక్టర్ గారిని కోరారు. ప్రతి తరగతి గది లో 40 మంది ఉండాలి అన్నారు.
==================