సిరా న్యూస్,రంగారెడ్డి;
విద్యా సంస్థలు ప్రారంభం కావడం తో విద్యార్ధులను తరలించే స్కూల్ బస్సుల పై రవాణా శాఖ ఫోకస్చేసింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు స్కూల్ బస్సుల పై తనిఖీలు కొనసాగాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, బాలాపూర్,కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం లో స్కూల్ బస్సుల పై దాడులు నిర్వహించారు. మోటర్ వాహనాల చట్టానికి విరుద్దంగా తిరుగుతున్న స్కూల్ బస్సుల పై కొరడా ఝుళిపించారు. ఆరీసీ, పర్మిట్, ఫిట్నెస్, ఫయర్ నియంత్రణ యంత్రాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్ లను తనిఖీలు చేస్తున్నారు.
బస్సు నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ చెక్ చేస్తున్నారు. 60 సంవత్సరాల వయస్సు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపకూడదని వార్నింగ్ ఇచ్చారు. రాజేంద్రనగర్ లో 5, చేవెళ్ల లో రెండు బస్సులు, బాలాపూర్ లో రెండు బస్సులు సీజ్ చేసారు.