సిరా న్యూస్,తిరుపతి;
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సీఆర్ రాజన్, ఎమ్యెల్యేలు పులివర్తినాని, ఆరని శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, సివిఎస్వో నరసింహ కిషోర్, డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా అమ్మవారి ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకున్న ముఖ్యమంత్రి దంపతులు అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం చంద్రబాబు, లోకేష్ దంపతులకు ఆశీర్వాద మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి వస్త్రం, కుంకుమ, తీర్థ ప్రసాదాలు అందజేశారు.