సిరా న్యూస్,అశ్వాపురం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మవారి పల్లి సీతారామ ప్రాజెక్టు వ్యూ నుంచి పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం పరిశీలించారు. వ్యూ పాయింట్ వద్ద సాగునీటి అధికారులు ఏర్పాటుచేసిన సీతారామ ప్రాజెక్ట్ ఫోటో ప్రజెంటేషన్ను తిలకించారు. ఇప్పటివరకు పూర్తయిన సీతారామ ప్రాజెక్టు పనుల వివరాలను డిప్యూటీ సీఎం, మంత్రులకు సాగునీటి పారుదల శాఖ అధికారులు వివరించారు.తరువాత మంత్రులు పంప్ హౌస్ పనులను పరిశీలించడానికి వ్యూ పాయింట్ నుంచి బయలుదేరారు.