Vasanth Rao: 10లీట‌ర్ల నాటుసారా ప‌ట్టివేత : ఎక్సైజ్ ఎస్సై వసంత్ రావు

సిరా న్యూస్, క‌డెం
10లీట‌ర్ల నాటుసారా ప‌ట్టివేత : ఎక్సైజ్ ఎస్సై వసంత్ రావు
త‌హ‌సీల్లార్ల ఎదుట బైండోవ‌ర్
* ఖానాపూర్ , కడెం మండలాలో ఎక్సైజ్ అధికారుల దాడులు

10లీట‌ర్ల నాటు సారాను పోలీసులు ప‌ట్టుకొని, ఇద్ద‌రి అరెస్ట్ చేసిన‌ట్లు నిర్మ‌ల్ ఎక్సైజ్ ఎస్సై, వసంత్ రావు తెలిపారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో గురువారం నర్సింహారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ ఆదిలాబాద్ ఆదేశాల మేరకు ఎంఏ. రాజాక్ డీపీఈఓ నిర్మల్ ఆధ్వర్యంలో ఖానాపూర్, కడెం మండలాలోని నర్సాపూర్, మాసైపేట్, ఎల్లాపూర్, మద్దిపాదగా గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 2 కేసులు నమోదు చేసి ఇద్ద‌రు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే వివిధ కేసులలో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను ఖానాపూర్ తహసీల్దార్ ముందు, 10 మంది నిందితులను కడెం తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. ఇంకోసారి నాటుసారా విక్రయస్తూ పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష లేదా 1,00,000 రూపాయలు జరిమానా విధిస్తారని తెలిపారు. ఈ దాడుల్లో సిబ్బంది రషీద్, వెంకటేష్, రవీందర్, రవళి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *