సిరా న్యూస్,హైదరాబాద్;
రాచకొండ కమీష్నరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి రాయల్ కాలనీలో సయ్యద్
సమీర్ అనే వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. చెంపాపేట్ బాబానగర్ కు చెందిన సయ్యద్ సమీర్ ను రాయల్ కాలనీ వద్ద తల్వార్ తో గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేసారు. డెకరేషన్ వర్క్ చేసే సమీర్ రాయల్ కాలనీ నుండి ఇంటికి వస్తుండగా హత్య జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునిదర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన ప్రదేశంలో చాలా మంది వ్యక్తులు గంజాయి తాగి తరచు గొడవలకు దిగుతుంటారని ఈ హత్యకు కారణం అదే అయి ఉండవచ్చని స్థానికుల అనుమానం
======================