సిరా న్యూస్,హైదరాబాద్;
ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి పెద్దఎత్తున సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్ హాజరై కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 1365 కిలోమీటర్ల పాదయాత్ర తో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కీలక భూమిక పోషించారని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్ గ్యారంటీలను అమలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు.
=======================