సిరా న్యూస్, కుందుర్పి
నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్షన్ రద్దు పై హర్షం
* గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడికి సన్మానం
కళ్యాణదుర్గం నియోజవర్గం కుందుర్పి మండలం మాయదార్లపల్లి లో పనిచేసే ప్రధానోపాధ్యాయుడు , ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ సస్పెన్షన్ ను రద్దు పై మాయదార్లపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా శనివారం మాయదార్లపల్లి గ్రామస్తులు నల్లపల్లి విజయ్ భాస్కర్‌ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామం లోని ప్రాథమికొన్నత పాఠశాల విలీనం జరగకుండా ఉపాధ్యాయుడు విజయ్ భాస్కర్ క్రియాశీలకం గా వ్యవహరించారని తెలిపారు.జ ఉద్యోగులు, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్య ల పరిష్కరం కోసం చాలా కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమం లో గ్రామస్తులు రంగప్ప, గోపాల్,పెద్దన్న, తిప్పేస్వామి, మంజప్ప, చరణ్, మర్రిస్వామి, బొమ్మలింగప్ప, జనార్దన్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు