సిరా న్యూస్,హైదరాబాద్;
వ్యవసాయ శాఖ పై సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డా.బీఆర్.అంబెడ్కర్ తెలంగాణా *సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్,సహకార,హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ రామ కృష్ణ రావు, సి.ఎం.ఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు హాజరయ్యారు .