సిరాన్యూస్, బోథ్
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు మున్సిఫ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించి మెరుగైన సదుపాయం కల్పించాలని ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు మున్సిఫ్ కోరారు. ఈసందర్బంగా శనివారం ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలను, యూనిఫాం లను అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం వివిధ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కొరత చూ డాలని కోరారు. కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ నాయకులు శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.