సిరా న్యూస్,నెల్లూరు;
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతున్న సిలికా క్వాడ్జ్ స్టోన్ అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ఓబులాపురం ఐరన్ ఓర్ మధు కూడా మైనింగ్ స్కాంలను మించిన స్కాం నెల్లూరు జిల్లాలో జరుగుతుందన్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్వగ్రామం పక్కనే కోట్లాది రూపాయల మైనింగ్ జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చేతకాకపోతే పసుపు కుంకుమ చీర గాజులు పంపుతాను కట్టుకొని ఆడంగులు వాడినని ఒప్పుకోవాలంటే మంత్రి కాకాని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించారు.