సిరాన్యూస్, ఆదిలాబాద్
బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాజర్షి షా
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిములకు ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షా శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ బక్రీద్ అని, సంతోషంగా , ఆనందంగా , భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అన్నారు. సోమవారం సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజావాణి ఉండదని, ప్రజలు దీనిని గమనించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి రాకూడదని తెలిపారు.