సిరా న్యూస్,ఉట్నూర్;
ఉట్నూర్ మండల కేంద్రంలో ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బొజ్జు పటేల్ విజయం సాధించిన సందర్భంగా కేబి కాంప్లెక్స్ నుండి వినాయక చౌక్ వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమాన నాయకులు కార్యకర్తలు ఆదివాసులు నృత్యతో సందడి చేశారు.ఉట్నూర్ మండల కేంద్రంలో ప్రధాన వీధిలో ఉన్న భారీ ర్యాలీ నిర్వహించారు .ర్యాలీలో భాగంగా తెలంగాణ తల్లి ,అంబేద్కర్, జగ్జీవన్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బొజ్జు పటేల్ మాట్లాడుతూ 500 రూపాయలకే గ్యాస్ అందిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పేదల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.తొందరలో ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్లో స్థాపిస్తామని పేర్కొన్నారు. .ఆరు గ్యారెంటీలను, మేనిఫెస్టోను పక్కగా అమలు చేస్తామని తెలిపారు.నాకు ఓటు వేసి నాపై ఆదరణ చూపిన ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటా అని .ప్రతి ఒక్క సమస్యలు తప్పకుండా తిరుస్తా అని హామీ ఇచ్చారు.