సిరాన్యూస్,బేల
బేలలో ఘనంగా బక్రీద్ వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ముస్లిములు ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు జరుపుకున్నారు. స్థానిక ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారుప్రార్థనల అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ ముబారక్ తెలుపుకున్నారు. ముస్లిములకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేయడానికి బేలామండల కాంగ్రెస్, పార్టీల ముఖ్య నాయకులు ఈద్గా వద్దకు చేరి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా ముస్లిం మత పెద్దలు మౌలానా మాట్లాడుతూ ప్రపంచ శాంతిని, ప్రజల శ్రేయస్సును కాంక్షించే పవిత్ర బక్రీద్ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.మత బేధాలు లేకుండా అందరు కలిసికట్టుగా ఉండాలని అన్నారు.