సిరా న్యూస్ ఆదిలాబాద్
ఆదివాసీ చట్టాల జోలికొస్తే మరో కొమరం భీం ఉద్యమం చేస్తాం వెట్టి దేవదాస్..
ఆదివాసుల చట్టాలు జోలికొస్తే మరో కొమరం భీమ్ ఉద్యమం తప్పదని ఆదివాసి పడతాం జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి దేవదాస్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ : పిసా చట్టం 1/70 చట్టం 5 షెడ్యూల్ కులాల జోలికి వస్తే మరో భీమ్ పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ చట్టాలను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తే సహించమన్నారు. కొందరు గిరిజనేతరులు ఎస్సీ,ఎస్టీల మధ్య వివాదం సృష్టించి వెన్నుపోటు పొడిచే కుట్రలు చేస్తున్నారన్నారు. ఈనెల 13న దళిత దెబ్బ కార్యక్రమం అనుమతి నిరాకరణ కొరకు ఆదివాసి వివిధ సంఘాల నాయకులతో కలెక్టర్, డీఎస్పీకి దరఖాస్తు ఇచ్చామని. అతి త్వరలో పేసా చట్టం ఆదివాసి ఏజెన్సీ హక్కుల పరిరక్షణ కోసం నిస్వార్ధంగా నిర్విరామంగా పోరాటం చేసే ఆదివాసి ఏజెన్సీ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోండువనా గణతంత్ర పార్టీ అధ్యక్షుడు తుమ్రం చందర్శరావ్, తదితరులు పాల్గొన్నారు