-ముఖ్యమంత్రికి విన్నవించడం ల్యాబ్ టెక్నీషియన్లు
సిరా న్యూస్,హైదరాబాద్;
ఏడు సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వాన్ని నిర్వహించిన పారా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాలని ల్యాబ్ టెక్నీషియన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. గత ఏడేళ్లుగా అప్పటి టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నియామకాలు చివరి దశకు చేరుకున్న తమను ఉద్యమాలు తీసుకోకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఆ నియామక ప్రక్రియను పక్కకు పెట్టి మరో మారు నోటిఫికేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వచ్చిన వార్తలు తీవ్రంగా కలిచి వేస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన నోటిఫికేషన్ల ఆధారంగానే నియామక ప్రక్రియ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇప్పటికే రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న తమ జీవితాలు గోచారంగా మారుతాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
======