సిరా న్యూస్,హైదరాబాద్;
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ పిఎస్ పరిధిలోని ఓ మహిళను తరుచూ ఎదురింటి వ్యక్తి తప్పా తాగి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తాడని అతను బయటికి వెళ్లినప్పుడల్లా ఇంటి ముందు కూర్చొని తాగుతూ నిన్ను రేప్ చేస్తానని అనడమే కాకుండా మా అత్తయ్యని కూడా మా ఇద్దరు చిన్న పాపలను కూడా తీసుకుపోయి రేప్ చేసి చంపేస్తానని బెదిరిస్తుంటాడని తెలిపింది. గాంధీనగర్ పిఎస్ పోలీసులకు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన కూడా ఇన్స్పెక్టర్ పట్టించుకోవడం లేదని అనంతరం డిసిపి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసిన కూడా ఓ సారి చెప్పడంతో తిరిగి మళ్లీ ఆ వ్యక్తి అలాగే ప్రవర్తిస్తున్నాడని గోడు వెల్లబోసుకుంది. ఇప్పటివరకు అతను 10 సార్లు బెదిరించాడని చెప్పింది.పోలీసులు తమకు న్యాయం చేయాలని తన భర్త, అత్తను తన పిల్లలను రక్షించాలని విన్నవించుకుంది.