సిరా న్యూస్ , వేములవాడ :
కార్తిక మాసం చివరి సోమవారం..
వేములవాడకు పోటెత్తిన భక్తులు
కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగించారు. దాదాపు 2 గంటలపాటు క్యూలైన్లలో నిలబడి కోడె మొక్కు చెల్లించుకున్నారు. సుమారు 40 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.