సిరాన్యూస్, కుందుర్పి
ఫాదర్ ఫెర్రర్ ఎనలేని సేవలు: సర్పంచ్ మారుతీశ్వరి రామమూర్తి
* ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కు ఘనంగా నివాళి
పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డిటి వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సర్పంచ్ మారుతీశ్వరి రామమూర్తి , వైసీపీ మండల కన్వీనర్ సత్యనారాయణ శాస్త్రి , మాజీ జెడ్పిటిసి సభ్యులు రాజగోపాల్ కుందుర్పి ఫాదర్ ఫెర్రర్ ఆలయంలో కీర్తిశేషులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ మారుతీశ్వరి రామమూర్తి మాట్లాడుతూ ఫాదర్ ఫెర్రర్ ఆర్డిటిని స్థాపించి ఎంతో సేవ చేశారన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య, పేదలకు ఉచిత వైద్యం, నివాసాలు లేని వారికి ఉచిత గృహాలు, మహిళా సంఘాలు ఏర్పాటు చేసి పేదల ఆర్థిక అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. జిల్లా పేదరిక నిర్మూలనకు ఫాదర్ ఫెర్రర్ ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.