సిరాన్యూస్, కళ్యాణదుర్గం
మంత్రులను కలిసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో నూతనంగా మంత్రి బాధ్యతలు చేపట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మని, జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని వారి చాంబర్లో శుక్రవారం కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి బాధ్యతలు చేపట్టిన వారికి ఎమ్మెల్యే సురేంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. రేపు అసెంబ్లీ లో ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎమ్మెల్యే వెంట
మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, టిడిపి నాయకులు రాజగోపాల్, తదితరులు ఉన్నారు.