ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో యోగా దినోత్సవం

సిరా న్యూస్,తాండూర్
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం లో తాండూర్ ఆర్యవైశ్య మరియు వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో 10 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. శుక్రవారం తాండూర్ పట్టణంలో ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగ మాస్టర్ మారుతి వధిరాజ్ గారిచే ఉదయం 5 గంటల నుంచి ఏడు గంటల వరకు యోగ ఆసనాలపై నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యజీవితంలో యోగ యొక్క అవసరం గురించి మాస్టర్ మారుతి వివరించారు ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యోగా దినోత్సవం లో మహిళలు సంఘం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *