నిరుపేద ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాను ఓపెన్ చేసి ఇచ్చిన యూపీఎస్సీ 2024 ర్యాంకర్స్

సిరా న్యూస్,హైదరాబాద్;
ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయంలో స్ఫూర్తి కార్యక్రమం ద్వారా 2024 యూపీఎస్సీ తెలుగు రాష్ట్రాల ర్యాంకర్స్ 105 నిరుపేద ఆడపిల్లలకు ఖాతాను ఓపెన్ చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరసింహారెడ్డి (ఐఆర్ఎస్), యుపిఎస్సి 03 వ ర్యాంకర్ అనన్య రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2006 లో మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ తెలుగు ర్యాంకర్స్ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదవారిని ప్రోత్సహిస్తూ వారికి ఆర్థికంగా సహాయం చేస్తున్నాము అన్నారు. ఇప్పటివరకు రెండు లక్షల మందికి సహాయం చేస్తూ స్ఫూర్తిని కలిగిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం భిన్నంగా సుకన్య సమృద్ధి యోజన ద్వారా నిరుపేద ఆడపిల్లలకు పోస్ట్ ఆఫీస్ లో ఖాతాను ఓపెన్ చేసి 1000 రూపాయల డిపాజిట్ 105 మందికి చేశాము అన్నారు

One thought on “నిరుపేద ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాను ఓపెన్ చేసి ఇచ్చిన యూపీఎస్సీ 2024 ర్యాంకర్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *