సిరా న్యూస్ జైనథ్
మాలి సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం…
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజే ప్రగతి భవన్ కు మహాత్మ జ్యోతిబాపూలే భవన్ అని పేరు మార్చారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన జైనథ్ లో మంగళవారం నాడు రేవంత్ రెడ్డి, మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపాటలకు మాలి సంఘం చేనేత కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా అఖిలభారత మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కూలే మాట్లాడుతూ : సామాన్య ప్రజల నుండి వచ్చే వినతుల్ని స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కరించడానికి ప్రజా దర్బార్ నిర్వహించడం హర్షనియమన్నారు. మాలిలకు ఎస్టీ హోదా కల్పించి మాలిలను సామాజికంగా ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. దీనిపై చెల్లప్ప కమిషన్ సర్వే పూర్తయిందన్నారు. మాలిలకు ఎస్టి హోదా కల్పిస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా సంఘం అధ్యక్షుడు విజయ్ వాడుగుర్, జైనథ్ మండల అధ్యక్షుడు పాండురంగ్, సునీల్, సందీప్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు