సిరాన్యూస్, బేల
ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసిన సాంగిడీ గ్రామస్తులు
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ లను శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల సాంగిడీ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామస్తులు ఎంపీ, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామస్తులు పలు సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లారు. సాంగిడి నుండి ఆదిలాబాద్ వెళ్లాలంటే సాంగిడిని అనుకోని ఉన్న ఉమ్రీ బ్రిడ్జి పూర్తి కాలేదని తెలిపారు. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా సాంగిడి టు కాప్సిరోడ్ సరిగ్గా లేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. సాంగిడి టు అవాల్పూర్ రోడ్ సాంక్షన్ చేయాలని విన్నవించారు. ఎంపీ ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించారని సాంగిడీ గ్రామస్తులు తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గోపతి విఠోభా, నిమ్మల భూమారెడ్డి ,మంచాల భూపతిరెడ్డి , మాజీ ఉప సర్పంచ్ సురేష్ గౌడ్, నందు గౌడ్, కదరపు ప్రవీణ్, సిద్రప్ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.