సిరాన్యూస్, చిగురుమామిడి
బొమ్మనపల్లిలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం కాపర్ వైరు చోరీ
గుర్తు తెలియని వ్యక్తులు రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ వైర్లను చోరీ చేసిన సంఘటన చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కత్తుల పెద్ద గొల్ల చంద్రయ్య, దరిపల్లి వీరస్వామి అనే రైతుల వ్యవసాయ బావుల వద్ద ఉన్న రెండు ట్రాన్స్ఫార్మర్లను ఆదివారం రాత్రి సమయంలో ధ్వంసం చేసినట్లు రైతులు తెలిపారు. అందులో ఉన్న కాపర్ వైర్ ను దొంగలించారు. ఖరీఫ్ వానాకాలం నారుమడి దున్నే సమయంలో ఇలా ట్రాన్స్ఫార్మర్ పగలగొడితే ఏ విధంగా తాము నాట్లు వేసుకోవాలని రైతులు వాపోయారు.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ శాఖ వారు కట్టుదిడ్డమైన చర్యలు చేపట్టాలన్నారు.